Rohit Sharma Best Innings In Test Cricket | Oneindia Telugu

2017-11-28 212

In 2010 against South Africa, he was less than an hour away from his Test debut when he hurt his ankle during warm-up and was ruled out. He could get another chance only after three years.

జీవితంలో విచారం ఉంటుందని, అయితే తన కాళ్లపై నిలబడి తిరిగి క్రికెట్‌ ఆడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని భారత ఆటగాడు రోహిత్‌ శర్మ అన్నారు. తన పదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కేవలం 22 టెస్టులు ఆడటంతో తనకున్న ప్రతిభకు న్యాయం చేసినట్టేనా? అన్న ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చాడు.
గాయం నుంచి కోలుకుని సరిగ్గా ఏడాది తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ తన కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో చేసిన సెంచరీ ఇది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ నాగ్ పూర్ టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడాడు.జీవితంలో ఒడుదొడుకులు తప్పవు. 10,000 పరుగులు చేస్తే 15,000 చేయాలనుకుంటాం. లేదంటే అభిమానులు 15,000 చేయాలని చెప్తారు. నా వరకైతే నేను మళ్లీ నా కాళ్లపై నిలబడి క్రికెట్‌ ఆడుతున్నందుకు సంతోషిస్తున్నా. 2016లో తొడకు శస్త్రచికిత్స తర్వాత కనీసం నడవగలనా? అనిపించింది. నేను లక్కీ! తిరిగి నిలబడ్డా. పరుగులు చేస్తున్నా. అందుకు సంతోషం' అని చెప్పాడు.గతంలో జరిగిన సంఘటనలను తలుచుకుంటూ పరిస్థితులను సంక్లిష్టంగా మార్చుకోను. నా ప్రణాళికలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. జట్టులోకి వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పని క్రికెట్‌ ఆడటమే. మొదట్లో నా దృష్టంతా టెస్టు క్రికెట్‌పై ఉండేది. బాగా ఆడాలనుకునే వాడిని. అయితే ఆలోచనల్లో పడి నేను చేయాల్సింది మర్చిపోయేవాడిని' అని అన్నాడు.